: ఉపఎన్నిక తర్వాతే మెదక్ సమగ్ర సర్వే ఫలితాలు విడుదల చేయాలి: భన్వర్ లాల్
మెదక్ ఎంపీ స్థానానికి ఉపఎన్నిక జరగనున్న నేపథ్యంలో ఈ ప్రాంతానికి సంబంధించిన సమగ్ర సర్వే వివరాలను బహిర్గతం చేయరాదని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్ లాల్ ఆదేశాలు జారీ చేశారు. త్వరలో ఇక్కడ ఉపఎన్నిక నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ క్రమంలో ఎన్నికల ఫలితాలను వెల్లడించిన తర్వాతే సర్వే వివరాలు విడుదల చేయాలన్నారు. అయితే, ఎన్నికల నోటిఫికేషన్ తో సంబంధం లేకుండా సర్వే మాత్రం నిర్వహించుకోవచ్చన్నారు.