: నా గాయానికి ఏడు కుట్లు పడ్డాయి: బాలకృష్ణ
తాను నటించే ప్రతి సినిమాకు ఓ గాయం గుర్తుగా ఉంటుందని సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. తనకు ఇటీవల తగిలిన గాయానికి ఏడు కుట్లు పడ్డాయని ఆయన తెలిపారు. వారం రోజుల్లో పూర్తిగా కోలుకుంటానని... తర్వాత షూటింగ్ లో పాల్గొంటానని చెప్పారు. ఈ రోజు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ, ఆయన ఈ వివరాలను వెల్లడించారు. తన వందో సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయని... అభిమానులను తృప్తి పరచడంలోనే తనకు ఆనందం ఉందని అన్నారు. అసెంబ్లీలో వైఎస్సార్సీపీ అనవసర రాద్ధాంతం చేస్తూ... సభా కార్యక్రమాలకు అడ్డు తగులుతోందని ఆరోపించారు.