: లాలూ ఓ రిటైర్డ్ కమెడియన్: రామ్ విలాస్ పాశ్వాన్ కుమారుడు


రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పై కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ కుమారుడు, ఎల్జేపీ ఉపాధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ విమర్శలు చేశారు. లాలూ ఓ రిటైర్డ్ కమెడియన్ అని, ఈ విషయాన్ని తెలుసుకోవాలని వ్యాఖ్యానించారు. అంతకుముందు రామ్ విలాస్ పాశ్వాన్ అవకాశవాది అంటూ బీహార్ ఎన్నికల ర్యాలీలో లాలూ ఆరోపించారు. ఇందుకు స్పందించిన చిరాగ్ పైవిధంగా ప్రతి విమర్శ చేశారు. బీహార్ ఉపఎన్నికల కోసం జేడీయూ నేత నితీశ్ కుమార్, లాలూ కలసి ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News