: సాధారణ హత్యలను... రాజకీయ హత్యలుగా చిత్రీకరిస్తున్నారు: దేవినేని


గత ప్రభుత్వ హయాంలో కొనసాగిన హత్యారాజకీయాలు ఇకపై కొనసాగవని మంత్రి దేవినేని ఉమ అన్నారు. సాధారణ హత్యలకు రాజకీయ రంగు పులిమి... రాజకీయ హత్యలుగా చిత్రీకరించేందుకు వైకాపా నేతలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ హత్యలను తమ అధినేత చంద్రబాబుకు ఆపాదించేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు, రైతుల సమస్యలు వైకాపాకు అవసరం లేదని అన్నారు. విలువైన సభాసమయాన్ని అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News