: హత్యలపై పూర్తి సమాచారం ఇవ్వండి... సభను అడ్డుకోవద్దు: అచ్చెన్నాయుడు
శాంతిభద్రతల తీర్మానంపై చర్చ జరపాలని పట్టుబడుతూ, సభా కార్యక్రమాలకు వైకాపా సభ్యులు అడ్డుపడుతున్నారని మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయని ఆయన తెలిపారు. తమ పార్టీకి చెందిన నేతలను టీడీపీ ప్రభుత్వం హత్యలు చేయిస్తోందంటూ వైకాపా నేతలు బూటకపు ప్రచారాలకు దిగుతున్నారని ఆరోపించారు. ఎవరు చనిపోయారు? ఎలా చనిపోయారు? అనే విషయాలపై సంపూర్ణమైన సమాచారాన్ని వైకాపా నేతలు ఇస్తే బాగుంటుందని ఆయన సూచించారు. అసెంబ్లీ వాయిదా పడిన అనంతరం మీడియా లాబీలో ఆయన ప్రసంగించారు. తమ పార్టీ నేత పరిటాల రవిని చంపింది వైకాపా అధినేత జగన్ కాదా? అంటూ నిలదీశారు. వైకాపా నేతలు తమ పద్దతి మార్చుకుని... విలువైన అసెంబ్లీ సమయం వృథా కాకుండా సహకరించాలని సూచించారు.