: ఏపీ శాసనసభ ప్రారంభం... వైకాపా తీర్మానాన్ని తిరస్కరించిన స్పీకర్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభం అవగానే... ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆరంభించారు. ఈ సందర్భంగా, శాంతిభద్రతలపై వైకాపా ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారు. జీరో అవర్ లో కానీ, మరో రూపంలో కానీ దీనిపై చర్చించుకుందామని ఆయన సూచించారు. దీంతో సభలో వైకాపా సభ్యులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. సభను సవ్యంగా నిర్వహించేందుకు సహకరించాలని వైకాపా సభ్యులకు స్పీకర్ విన్నవిస్తున్నారు.