: ముగిసిన ఏపీ బీఏసీ సమావేశం... జగన్ డిమాండ్ ను తోసిపుచ్చిన బీఏసీ
ఏపీ అసెంబ్లీ బీఏసీ సమావేశం ముగిసింది. ఈ దఫా అసెంబ్లీ సమావేశాలను సెప్టెంబర్ 6 వరకు నిర్వహించాలని బీఏసీ నిర్ణయించింది. అలాగే, అసెంబ్లీ సమావేశాలను ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే నిర్వహించాలని బీఏసీ తీర్మానించింది. వచ్చే నెల సెప్టెంబర్ 12 వరకు అసెంబ్లీ సమావేశాలను పొడిగించాలని బీఏసీ సమావేశంలో వైకాపా అధినేత జగన్ డిమాండ్ చేశారు. అయితే ఈ డిమాండ్ ను బీఏసీ నిరాకరించింది.