: తెలంగాణ రాష్ట్రంలో 174 ఇంజినీరింగ్ కాలేజీల గుర్తింపు రద్దు


త్వరలో ప్రారంభమయ్యే విద్యా సంవత్సరానికి... 174 ఇంజినీరింగ్ కాలేజీల గుర్తింపును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఈ నిర్ణయాన్ని తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ టి.పాపిరెడ్డి నిన్న వెల్లడించారు. ఏఐసీటీఈ నిబంధనలకు అనుగుణంగా, ఈ కాలేజీలు సరైన విద్యాప్రమాణాలు పాటించడం లేదని ఇటీవల చేసిన తనిఖీల్లో స్పష్టమైందని ఆయన అన్నారు. ఈ కారణంగానే, ఈ కాలేజీల గుర్తింపును రద్దు చేయాల్సి వచ్చిందని వ్యాఖ్యానించారు. ఈ నిర్ణయం కారణంగా... జేఎన్టీయూఎచ్, ఓయు రీజియన్ లో ప్రస్తుతం 141 కళాశాలలకు మాత్రమే అఫిలియేషన్ ఉందని ఆయన తెలిపారు. అఫిలియేషన్ (గుర్తింపు) ఉన్న కాలేజీలకు మాత్రమే విద్యార్థులు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలని సూచించారు. 174 కాలేజీలను రద్దు చేయడంతో తెలంగాణలో ఇంజనీరింగ్ సీట్ల సంఖ్య ప్రస్తుతం 85 వేలకు తగ్గిందన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకే కాలేజీల సంఖ్యను కుదించామని పాపిరెడ్డి స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News