: టార్గెట్ నవాజ్ షరీఫ్... సహాయ నిరాకరణకు ఇమ్రాన్ ఖాన్ పిలుపు
ప్రపంచ ప్రఖ్యాత మాజీ క్రికెటర్, తెహ్రీకే ఇన్సాఫ్ అధినేత ఇమ్రాన్ ఖాన్ పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ పై కత్తిగట్టారు. అధికార పీఠం నుంచి షరీఫ్ ను కూలదోయడమే ఏకైక లక్ష్యంగా కార్యాచరణ రూపొందించారు. ఈ క్రమంలో, సహాయ నిరాకరణ ఉద్యమం చేపట్టాలంటూ పాక్ ప్రజలకు ఇమ్రాన్ పిలుపునిచ్చారు. ప్రభుత్వానికి ఎలాంటి పన్నులు చెల్లించరాదని, విద్యుత్, గ్యాస్ బిల్లులు కట్టరాదని ప్రజలకు సూచించారు. ఇప్పటికే లెక్కలేనన్ని దేశ అంతర్గత సమస్యలతో అల్లాడుతున్న షరీఫ్ సర్కారుకు... ఇమ్రాన్ సహాయ నిరాకరణ పిలుపు మరెంత ఇబ్బందిని తెచ్చిపెడుతుందో వేచి చూడాలి.