: చైన్ స్నాచర్ శివ గ్యాంగ్ అరెస్ట్
శనివారం నాడు పోలీస్ కాల్పుల్లో మరణించిన చైన్ స్నాచర్ శివ గ్యాంగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. శివ భార్య నాగలక్ష్మి, అనుచరులను ఎస్ వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.30 లక్షల విలువైన చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు శివ గ్యాంగ్ ఏడు వందలకు పైగా దొంగతనాలకు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. శివ చేసే దొంగతనాలకు భార్య పూర్తిగా సహకరించిందని సీపీ ఆనంద్ చెప్పారు. పలు చైన్ స్నాచింగుల్లో నాగలక్ష్మి కూడా పాల్గొందని ఆయన వెల్లడించారు.