: లంచం తీసుకుంటే ‘ఫేస్’ బుక్కవడం ఖాయం!
అవినీతిని నిరోధించడానికి మహారాష్ట్ర ఏసీబీ అధికారులు వినూత్న పథకాన్ని ప్రారంభిస్తున్నారు. లంచం తీసుకుంటూ పట్టుబడిన వారి ఫోటోలను ఫేస్ బుక్ లో పెట్టాలని వారు నిర్ణయించారు. దీనివల్ల అవమానంతో అధికారులు అవినీతికి దూరంగా ఉంటారని వారు భావిస్తున్నారు. మరో వారం రోజుల్లో ఫేస్ బుక్ పేజీ సిద్ధమవుతుందని ఏసీబీ డీజీపీ ప్రవీణ్ దీక్షిత్ తెలిపారు.