: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి కంగ్రాట్స్ చెప్పిన జయలలిత


బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన డాక్టర్ తమిళిసాయి సౌందర్ రాజన్ (53)ను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత అభినందించారు. తాజాగా తమిళనాడు బీజేపీ బాధ్యతలు తీసుకున్న సౌందర్ రాజన్ కు తన అభినందనలు అంటూ లేఖలో పేర్కొన్నారు. ‘చాలా సంతోషం, తమిళ రాష్ట్ర విభాగానికి సౌందర్ రాజన్ బాధ్యతలు స్వీకరించినందుకు అభినందనలు’ అని జయలలిత లేఖలో పేర్కొన్నారు. బీజేపీ జాతీయ కార్యదర్శిగా పనిచేసిన సౌందర్ రాజన్ శనివారం నాడు తమిళనాడు బీజేపీ పగ్గాలు చేపట్టారు.

  • Loading...

More Telugu News