: ఏపీ రాజధానిపై చంద్రబాబుకు కేసీఆర్ సలహా
ఆంధ్రప్రదేశ్ రాజధానిపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సలహా ఇచ్చారు . రాజధానికి ఉత్తరం నుంచి నది ప్రవహిస్తే మంచిదని ఆయన అన్నారు. అలాంటి నగరాలన్నీ ఎంతో అభివృద్ధి చెందాయని కేసీఆర్ చెప్పారు. రాజధానికి ఏ ప్రాంతం అయితే బాగుంటుందని కేసీఆర్ ను చంద్రబాబు అడిగారు. దానికి బదులిస్తూ కేసీఆర్ అమరావతి, మంగళగిరి లాంటి ప్రాంతాలు అయితే బాగుంటుందని చెప్పారు.