: ఈ నెల 27న హజ్ యాత్రకు బయల్దేరుతున్న తొలి బృందం


హజ్ యాత్రకు బయల్దేరేందుకు 275 మందితో కూడిన తొలి బృందం సిద్ధమవుతోంది. జమ్మూ కాశ్మీర్ నుంచి ఈ నెల 27న ఈ బృందం హజ్ యాత్రకు బయల్దేరుతోంది. సౌదీ అరేబియాలోని ఈ పుణ్యక్షేత్రానికి శ్రీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి తొలి బృందం ఈ నెల 27వ తేదీన బయల్దేరుతోందని అధికారులు తెలిపారు. హజ్ యాత్రికుల సౌకర్యార్థం సెప్టెంబరు 12వ తేదీ వరకు శ్రీనగర్ ఎయిర్ పోర్టు నుంచి క్రమం తప్పక విమానాలు నడుస్తాయని వారు వెల్లడించారు.

  • Loading...

More Telugu News