: కలెక్షన్ల వర్షం కురిపించిన ‘సికిందర్’
సూర్య హీరోగా నటించిన తమిళ సినిమా అంజాన్ విడుదలై కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. తెలుగులో ‘సికిందర్’గా విడుదలైన ఈ సినిమా రెండు రోజుల్లోనే రూ.15 కోట్లు వసూలు చేయడం విశేషం. లింగుస్వామి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సూర్య సరసన సమంత హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. సినిమాకు డివైడ్ టాక్ వచ్చినప్పటికీ ముందుగా తీసుకున్న టిక్కెట్ల కారణంగా మంచి ఓపెనింగ్స్ వచ్చాయని విశ్లేషకులు అంటున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఈ సినిమా తమిళనాడుతో పాటు ఆంద్రప్రదేశ్, కేరళ, కర్ణాటకలో విడులైంది.