: ధనిక, పేద వర్గాల మధ్య పెళ్లిళ్లతో దేశభక్తి నిరూపణ: జస్టిస్ కట్జూ వ్యాఖ్య


తమలోని నిజమైన భారతీయతను అటు హిందువులతో పాటు ఇటు ముస్లింలు కూడా నిరూపించుకునేందుకు ఓ చక్కటి మార్గముందని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, ప్రెస్ కౌైన్సిల్ ఛైర్మన్ జస్టిస్ మార్కాండేయ కట్జూ అన్నారు. అసలు దేశ భక్తికి, ఈ పెళ్లిళ్లకి సంబంధమేంటని అడిగితే.., నిజమైన భారతీయులుగా అనిపించుకోవాలనుకునే హిందువులు, దళితులను తక్కువగా చూడరాదు; దళితులు, దళితేతరుల మధ్య కులాంతర వివాహాలు కూడా విరివిగా జరగాలని చెప్పారు. ఇక ముస్లింల విషయానికొస్తే, వారు తమ భారతీయతను నిరూపించుకునేందుకు బీద-గొప్ప తారతమ్యాన్ని విడనాడాలని కట్జూ అన్నారు. అందుకు ఏం చేయాలని అడిగితే, ఉన్నత-నిమ్న శ్రేణి వర్గాల మధ్య పెళ్లిళ్లు జరగాలని చెప్పారు. మహిళలను తక్కువగా చూపే ముస్లిం పర్సనల్ లా బోర్డును రద్దు చేయాలని కూడా కట్జూ అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యలను కట్జూ తన సొంత బ్లాగ్ లో పోస్ట్ చేశారు.

  • Loading...

More Telugu News