: భూకంపం ధాటికి ఇరాన్ విలవిల.. 40 మంది మృతి


నేటి సాయంత్రం సంభవించిన భూకంపం ధాటికి ఇరాన్ లో 40 మంది మరణించారు. రిక్టర్ స్కేల్ పై 8 తీవ్రతతో సంభవించిన ఈ భూకంప కేంద్రం ఇరాన్, పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతమైన కాస్ వద్ద ఉన్నట్టు గుర్తించారు. భూమికి 15 కిలోమీటర్ల లోతున ఈ పెనుకంపం సంభవించింది. కాగా, ఆ భూకంపం ప్రభావంతో ఉత్తర భారత దేశంలోనూ పలు చోట్ల ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. కొన్ని చోట్ల 45 సెకన్లపాటు భూమి కంపించిందని ప్రత్యక్ష సాక్షులు అంటున్నారు. అయితే భారత్ లో ఎక్కడా ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు.

  • Loading...

More Telugu News