: విశాఖలో తనికెళ్ల భరణి విరచిత ‘ప్యాసా’ ఆవిష్కరణ
‘ఉమరు ఖయ్యాము! నీకు సలాములోయి’ అంటూ ప్రముఖ రచయిత, నటుడు తనికెళ్ల భరణి కలం నుంచి జాలువారిన ‘ప్యాసా’ రుబాయిల సంపుటిని విశాఖలో ఆవిష్కరించారు. విశాఖ మ్యూజిక్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి గంటా శ్రీనివాసరావు ‘ప్యాసా’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. విశాఖ మ్యూజిక్ అకాడమీ అధ్యక్షుడు రంగరాజన్, విజయ నిర్మాణ్ కంపెనీ అధినేత విజయ్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.