: బీజేపీని మట్టి కరిపించేందుకు బద్దశత్రువుల రెండో ర్యాలీ


బీహార్ ఉప ఎన్నికల్లో బీజేపీని ఎలాగైనా మట్టికరిపించాలని బద్ధశత్రువులు, తాజాగా మిత్రులైన నితీష్ కుమార్, లాలూప్రసాద్ యాదవ్ నేడు రెండో బహిరంగ సభ నిర్వహించనున్నారు. గతవారం వీరిద్దరూ తొలిసారి ఒకే వేదికపై కనిపించినప్పటికీ పెద్దగా ఆదరణ లభించలేదు. ఈసారైనా వీరి జోడీ ప్రజాకర్షణ సంపాదించడంలో విజయవంతం అవుతుందో లేదో చూడాలి మరి. ఆగస్టు 21న బీహార్ లోని పది శాసనసభ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగనున్నాయి. కాగా, మరో వైపు ప్రచారంలో బీజేపీ దూసుకుపోతోంది.

  • Loading...

More Telugu News