: సింహాద్రి అప్పన్న ఆలయంలో నిత్యాన్నదాన పథకం ప్రారంభం


విశాఖ జిల్లాలోని సింహాచలంలోని అప్పన్న ఆలయంలో నిత్యాన్నదాన పథకాన్ని మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ పథకంలో భాగంగా ఇవాళ్టి నుంచి 5 వేల మందికి అన్నప్రసాద వితరణ ఉంటుంది. విశాఖలోని కనక మహాలక్ష్మీ ఆలయ ఆవరణలో రూ. 68 లక్షల వ్యయంతో నిర్మించిన అన్న ప్రసాద వితరణ భవన సముదాయాన్ని మంత్రి గంటా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గణేష్ కుమార్, ఈవో భ్రమరాంబ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి గంటా మాట్లాడుతూ... సింహాచలం దేవస్థానానికి కోట్లాది రూపాయల విలువ చేసే భూములున్నాయని, ఆయా భూముల్లో ఇంజనీరింగ్, మెడిసిన్ వంటి విద్యాకోర్సుల నిర్వహణకు వీలుగా విద్యాసంస్థలను ఏర్పాటు చేస్తామని చెప్పారు.

  • Loading...

More Telugu News