: తిరుమలేశుని దర్శనానికి 30 గంటలు
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనార్థం వేచి ఉన్న భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి. క్యూ లైన్లలో వెలుపలకు మూడు కిలోమీటర్లకు పైగా భక్తులు బారులు తీరారు. శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటలు, కాలినడకన వచ్చే భక్తుల దివ్యదర్శనానికి 16 గంటల సమయం పడుతోంది. ప్ర్తత్యేక ప్రవేశ దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది.