: బాబు, కేసీఆర్ తొలి కలయిక షురూ... ఫలిస్తాయా?


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తొలికలయిక నిర్విఘ్నంగా జరిగింది. గతంలో రాష్ట్రపతి రాక సందర్భంగా, స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా యాదృచ్ఛికంగా కలుసుకున్న వీరిద్దరూ పలకరింపులు, చిద్విలాసాలకే పరిమితమయ్యారు. 'నువ్వొకటంటే నేను రెండంటా' స్థాయిలో విభేదించిన వీరిద్దరూ అధికారికంగా తొలిసారి సమావేశమయ్యారు. వీరి తొలి సమావేశం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. సచివాలయ ఉద్యోగుల విభజన సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సమావేశమైన వీరిద్దరూ భవిష్యత్ పై సానుకూల సందేశాలు పంపారు. అయితే చర్చలు సంతృప్తికరంగా ముగుస్తాయా? లేదా? అనే దానిపై రెండు రాష్ట్రాల భవిష్యత్ ముడిపడి ఉంది. చర్చలు ఫలప్రదంగా సాగితే మరిన్ని సమస్యలు సానుకూలంగా పరిష్కారమవుతాయి, చర్చలు ఫలవంతం కాని పక్షంలో విభేదాలు, విద్వేషాలు రాజ్యమేలుతాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News