: ఆ మహిళ.. మహిళా లోకానికే మాయని మచ్చ!


దేశంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై ఓ వైపు యువతతో పాటు దేశం యావత్తు ఆగ్రహావేశాలతో ఊగిపోతోంది. దీంతో దిగివచ్చిన ప్రభుత్వాలు అత్యాచారాల నిరోధం కోసం ప్రత్యేకంగా చట్టాలను రూపొందించాయి. అయితే ఆ మహిళ మాత్రం, రేపిస్టుల కంటే క్రూరంగా ప్రవర్తించింది. సభ్య సమాజం తల దించుకునేలా వ్యవహరించింది. స్నేహితురాలినే తన భర్తతో అత్యాచారం చేయించింది. తన భర్తతో ‘ఆ’ సంబంధం నెరపకపోతే, తన భర్తతో హత్య చేయిస్తానని కూడా బెదిరించింది. ఒక్కసారే కాదు తామడిగినప్పుడల్లా, తన భర్త చేతిలో ‘నలిగి’ పోవాల్సిందేనని హూంకరించింది. కొంతకాలం పాటు బాధను పంటిబిగువున భరించిన బాధితురాలు ఎట్టకేలకు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ మహిళతో పాటు ఆమె భర్త శ్రీకృష్ణ జన్మస్థానం చేరారు. సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేసిన ఈ ఘటన బెంగళూరులో చోటచేసుకుంది. ఇంటిపక్కన ఉండే మహిళే కదా అని స్నేహం చేసిన ఓ అభాగ్యురాలు, సదరు మహిళ విచిత్ర కోరిక విని విస్తుపోయింది. తన కళ్లెదుటే తన భర్తతో సన్నిహితంగా గడపాలన్న ఆ మహిళ ఆజ్ఞను తిరస్కరించిన బాధితురాలికి చంపేస్తామన్న బెదిరింపులు ఎదురయ్యాయి. దీంతో నెలక్రితం పంటి బిగువునే బాధను భరించింది. అయితే నెల తిరక్కుండానే మరోమారు తమ ‘మాట’ వినాల్సిందేనని ఆ మహిళ పట్టుబట్టడంతో బాధితురాలు, విషయాన్ని తన భర్తకు చెప్పింది. బాధితురాలి భర్త ఫిర్యాదు మేరకు ఆ మహిళను, ఆమె భర్తను బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News