: బికినీలపై గోవా పాలకుల మాటల తూటాలు


గోవా... సహజసిద్ధ బీచులకు పెట్టింది పేరు. విదేశీ పర్యాటకులకు స్వర్గధామం. గోవా రాష్ట్ర ఆదాయానికి కూడా ఆ బీచులు తమవంతు పాత్ర పోషిస్తున్నాయి. సాధారణంగా బీచుల్లో బికినీలు సర్వసాధారణం. అయితే ఈ బికినీల వ్యవహారంపై చట్టసభల్లో, చట్టసభలకు ఎన్నికైన ప్రజా ప్రనిధిలులు దృష్టి సారించాల్సినంత పనేమీ లేదనుకోండి. అయినా గోవా నేతలు నిత్యం ఇలాంటి వివాదాల్లోనే మునిగి తేలుతుంటారు. తాజాగా గోవాలో బికినీ భామలకు ఓ ప్రత్యేక బీచ్ ను ఏర్పాటు చేద్దామంటూ మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీ ఎమ్మెల్యే లావు మామ్లేదర్ సరికొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. చుట్టూ ఫెన్నింగ్ ఏర్పాటు చేసే ఈ బీచ్ లోకి ప్రవేశించాలంటే ఓ వెయ్యో, రెండు వేల రూపాయలో ఎంట్రీ ఫీజు వసూలు చేస్తే రాష్ట్ర ఆదాయం కూడా గణనీయంగా పెరుగుతుందన్నది ఆయన ప్రతిపాదన సారాంశం. అయితే దీనిపై కాంగ్రెస్ తో పాటు మహిళా హక్కుల సంఘాలు ఒంటికాలిపై లేచాయి. మహిళామణులను బికినీ బీచ్ లకే పరిమతం చేస్తారా అంటూ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి దుర్గాదాస్ కామత్ అంతెత్తున ఎగిరిపడ్డారు. అయినా, ప్రజల సంక్షేమంపై దృష్టి పెట్టాల్సిన వీరికి అసలు బికినీల సంగతి ఎందుకు చెప్పండి.

  • Loading...

More Telugu News