: టీడీపీ, వైఎస్సార్సీపీ వర్గాల మధ్య ఘర్షణ, ఆరుగురికి గాయాలు


ప్రకాశం జిల్లా దోర్నాల మండలం ఐనముక్కల ఎస్పీ వాడలో టీడీపీ, వైఎస్సార్సీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇరు పార్టీల కార్యకర్తల మధ్య పరస్పర దాడుల నేపథ్యంలో ఆరుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. పాతకక్షల నేపథ్యంలో ఆదివారం ఇరు వర్గాలు బాహాబాహీకి దిగాయి. ఈ ఘర్షణలో గాయపడ్డవారిని పెద్ద దోర్నాల ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించినట్లు పెద్ద దోర్నాల ఎస్సై బ్రహ్మనాయుడు తెలిపారు.

  • Loading...

More Telugu News