: సీనియర్ నటి ఆస్తి కోసం కుమ్ములాట


సినిమాల్లో ఆమె ఎన్నో తగవులు తీర్చింది. సీనియర్ నటిగా కీర్తిప్రతిష్ఠలు మూటగట్టుకుంది. కానీ, తను సంపాదించిన ఆస్తి కోసం తన వారసులు సిగపట్లు పడుతుండటం కూడా తెలియని స్థితిలో ఆమె ఉంది. తనే ప్రముఖ నటి మనోరమ! తెలుగు, తమిళ సినిమాల్లో అమ్మ పాత్రలతో సుపరిచితురాలైన మనోరమ ఆస్తి వ్యవహారం కుటుంబసభ్యుల మధ్య తగాదాలు రేపుతోంది. మనోరమ మనవడిపై, మనవరాలు అభిరామి (25) చెన్నై సిటీ సివిల్ కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. మనోరమ తన బామ్మ అని, ఆమెకు చెన్నై, తిరువళ్లూరు ప్రాంతాల్లో కోట్లాది రూపాయల విలువ చేసే స్థిరాస్తులున్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం తన బామ్మ ఆరోగ్యం క్షీణించి, తన చుట్టూ ఏమి జరుగుతోందో కూడా తెలియని స్థితిలో ఉన్నారని పిటిషన్ లో పేర్కొన్నారు. తన తండ్రి భూపతి మద్యానికి బానిసై మతి స్థిమితం లేని దుస్థితిలో, టీనగర్‌లోని ఇంట్లో నివసిస్తున్నారని తెలిపారు. వీరి అనారోగ్యాన్ని సాకుగా తీసుకుని తన సోదరుడు డాక్టర్ రాజరాజన్ తన బామ్మ ఆస్తులను తన పేరుపై మార్చుకున్నారని ఆరోపించారు. తన బామ్మ సొత్తులో తనకు సమభాగం వాటాగా రావాలని ఆమె పిటిషన్ లో న్యాయస్థానానికి తెలిపారు. అలాంటిది రాజరాజన్ ఆస్తిని విక్రయించడానికి ప్రయత్నిస్తున్నారని, తానేదయినా చర్యకు దిగితే అది తన ప్రాణానికే ముప్పుతేవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిని విచారించిన న్యాయమూర్తి లక్ష్మీకాంతన్ ఈ నెల 22వ తేదీ లోపు సమాధానమివ్వాలని రాజరాజన్ ను ఆదేశించారు.

  • Loading...

More Telugu News