: హమ్మయ్యా...సివిల్స్ లో ఇంగ్లిష్ లేదు!


సివిల్స్ పరీక్షల్లో ఇంగ్లిష్ తప్పని సరి చేయడంపై విద్యార్థిలోకం చేసిన పోరాటం ఫలించింది. వారి డిమాండ్ కు ప్రభుత్వం తలొగ్గింది. ఇంగ్లిష్ కాంప్రహెన్షన్‌ పేపర్‌ను రాయాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇంగ్లిష్ పేపరును మూల్యాంకనం చేయబోమని, రాసినా ఆ మార్కులను లెక్కించబోమని తేల్చి చెప్పింది. ఈ మేరకు కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖ ప్రకటన విడుదల చేసింది. ఇంగ్లిష్ పేపర్‌కు కేటాయించిన రెండు గంటల సమయం యథాతథంగా ఉంటుందని, ఆ సమయాన్ని ఇతర ప్రశ్నలను పూరించడానికి ఉపయోగించుకోవాలని సూచించింది. మొత్తం మార్కుల్లో ఇంగ్లిషుకు కేటాయించిన 200 మార్కులను లెక్కలోకి తీసుకోమని వెల్లడించింది. సివిల్స్‌ ప్రిలిమ్స్‌ ఈ నెల 24న జరుగనున్న సంగతి తెలిసిందే. ఇందులో ఇంగ్లిషు లాంగ్వేజ్‌ కాంప్రహెన్షన్‌ స్కిల్స్‌ రెండవ పేపర్‌గా ఉంది. కాగా, యూపీఎస్సీ ప్రస్తుత చైర్మన్‌ డి.పి. అగర్వాల్‌ పదవీ కాలం శనివారం ముగిసింది. దీంతో రజనీ రజ్దన్‌ కొత్త చైర్మన్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. 2010 ఏప్రిల్‌ 19న కమిషన్‌ సభ్యురాలిగా చేరిన రజ్దన్‌ హర్యానా కేడర్‌ ఐఏఎస్‌ అధికారి.

  • Loading...

More Telugu News