: చైనా బీచుల్లో ముసుగులే ముసుగులు
చైనా బీచుల్లో ఎటు చూసినా ముసుగులే కనబడుతున్నాయి. మన దేశంలోని మెట్రోపాలిటన్ పట్టణాల్లో కాలుష్యం బారిన పడకుండా పడతులు ముఖం చుట్టూ స్కార్ఫ్, చున్నీలు అడ్డం పెట్టుకున్నట్టు అక్కడ కూడా మహిళలు ముసుగులు ధరిస్తున్నారు. అయితే మనలా అందుబాటులో ఉన్న వనరులతో కాకుండా ముసుగుతో కూడిన స్విమ్ సూట్లు ధరిస్తున్నారు. 'ఫేస్ కినీ' అని వీటికో పేరు కూడా పెట్టేశారు. దీనిని కేవలం ముఖానికి మాత్రమే ధరించేవారు కొందరైతే, పూర్తిగా సూట్ ధరించేవారు మరికొందరు. ఎక్కువ మంది ఫుల్ సూట్ ధరించేందుకే మొగ్గుచూపడం విశేషం. ఈ సూట్ వల్ల రెండు ఉపయోగాలున్నాయని అంటున్నారు. సూర్యుడి అతినీలలోహిత కిరణాల బారినుంచి కాపాడడమే కాకుండా, జెల్లీ ఫిష్ కాటు నుంచి కూడా ఈ సూట్ కాపాడుతోంది. అంతే కాదండోయ్, సూట్ ఫుల్ గా ఉండడంతో పెద్దగా అసభ్యత కూడా గోచరించకపోవడం విశేషం. దీని ధర కూడా కేవలం 300 రూపాయలే.