: కోస్తాకు భారీ వర్ష సూచన
కోస్తా జిల్లాల్లో భారీవర్షాలు పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రాయలసీమ, తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని సూచించింది. ఒడిశా నుంచి కోస్తా మీదుగా తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి బలంగా ఉందని, రుతుపవన ద్రోణి కూడా కలసి రావడంతో వర్షాలకు అనుకూలంగా మారిందని, వీటి ప్రభావంతో కోస్తాంధ్రలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. కాగా, గత రాత్రి గుడివాడలో 11, శ్రీకాళహస్తిలో 8, తడలో 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.