: గాంధీ భవన్లో కాంగ్రెస్ నేతల భేటీ... మేధోమథనంపై చర్చ


హైదరాబాదు గాంధీ భవన్లో తెలంగాణ కాంగ్రెస్ నేతల భేటీ ముగిసింది. పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, జానారెడ్డి, ఉత్తమ్ కుమార్, డీఎస్, షబ్బీర్ అలీ తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈనెల 24, 25 తేదీల్లో జరిగే పార్టీ మేధోమథనంపై వారు చర్చించారు. మేధోమథనానికి ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ హాజరవుతారని కాంగ్రెస్ నేతలు తెలిపారు.

  • Loading...

More Telugu News