: 'పీకే'లో ఏముందన్నది ప్రజలే గ్రహిస్తారు: అమీర్ ఖాన్


తాజా చిత్రం 'పీకే'పై కథానాయకుడు అమీర్ ఖాన్ మరోసారి స్పందించారు. తన సినిమా పోస్టర్లలో అసభ్యత ఎక్కడా లేదని, ఆ సినిమాను ప్రజలు చూస్తారని, అందులో ఏమున్నదన్న విషయాన్ని వారే గ్రహిస్తారని చెప్పుకొచ్చారు. విడుదలకు ముందు ఇంతకుమించి మాట్లాడడం సరికాదని ఈ మిస్టర్ పర్ఫెక్షనిస్టు పేర్కొన్నారు. ఈ చిత్రం తన కెరీర్లో ఓ సవాల్ వంటిదని అమీర్ అభివర్ణించారు. తన ఫ్యూచర్ పై పీకే తప్పక ప్రభావం చూపుతుందని అభిప్రాయపడ్డారు. కాగా, అమీర్ ఈ సినిమాలో భోజ్ పురి యాసలో మాట్లాడే వ్యక్తిగా కనిపిస్తారు. అనుష్క శర్మ హీరోయిన్ గా నటించింది.

  • Loading...

More Telugu News