: ఏపీ బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ ఖరారు


ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 18 నుంచి సెప్టెంబర్ 12 వరకు సమావేశాలు జరుగుతాయి. 20న ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెడతారు. 22న మంత్రి పత్తిపాటి పుల్లారావు వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెడతారు. అదే రోజు నుంచి 28 వరకు బడ్జెట్ పై ఏపీ అసెంబ్లీలో చర్చ జరుగుతుంది. ఇరవై ఎనిమిదవ తేదీన బడ్జెట్ పై ప్రభుత్వం సమాధానాలు ఇస్తుంది. వచ్చే నెల 12న ద్రవ్య వినిమయ బిల్లుకు సభ ఆమోదం తెలపనుంది. మొత్తం 18 రోజుల పాటు సమావేశాలు జరుగుతాయి. ఇక తొలిరోజు ఉదయం 8 గంటలకు బీఏసీ సమావేశం జరుగుతుంది. తర్వాత ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటలవరకు ఆ రోజు అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి. 20వ తేదీన రాష్ట్ర బడ్జెట్ ను మంత్రి రామకృష్ణుడు మండలిలో ప్రవేశపెడతారు.

  • Loading...

More Telugu News