: మనమ్మాయిలు గెలిచారు... ధోనీ సేనకు స్ఫూర్తి కలిగేనా..?


భారత పురుషుల, మహిళల జట్లు ప్రస్తుతం ఇంగ్లండ్ టూర్లో ఉన్న సంగతి తెలిసిందే. ధోనీ సేన దారుణ ప్రదర్శనలతో పరాజయాల బాటలో నడుస్తుండగా, మహిళల జట్టు స్ఫూర్తిదాయక ప్రదర్శనతో ఇంగ్లండ్ జట్టుపై తొలి టెస్టులో 6 వికెట్ల తేడాతో గెలుపు నమోదు చేసింది. వామ్ స్లీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో ఇంగ్లండ్ మహిళలు తొలి ఇన్నింగ్స్ లో 92 పరుగులు చేయగా, భారత్ 114 పరుగులు నమోదు చేసింది. ఇక, రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ 202 పరుగులు చేయగా... మిథాలీ సేన 4 వికెట్లు కోల్పోయి 181 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించింది. కెప్టెన్ మిథాలీరాజ్ (50 నాటౌట్) రెండో ఇన్నింగ్స్ లో అజేయ అర్థసెంచరీ సాధించి జట్టు విజయంలో ప్రధానపాత్ర పోషించడం విశేషం. ఈ విజయాన్ని చూసైనా టీమిండియా మేల్ స్టార్లు ఓవల్ లో చెలరేగితే అభిమానులకు అంతకన్నా కావాల్సిందేముంటుంది!

  • Loading...

More Telugu News