: టీఆర్ఎస్ లోకి పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి
దివంగత కాంగ్రెస్ సీనియర్ నేత పి.జనార్ధన్ రెడ్డి కుమార్తె విజయారెడ్డి టీఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం వైఎస్సార్సీపీలో ఉన్న ఆమె ఆ పార్టీకి రాజీనామా చేసి, ఈ నెల 20న తెలంగాణ రాష్ట్ర సమితి తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ మేరకు కొన్ని రోజుల కిందటే సీఎం కేసీఆర్ ను విజయ కలిసి చర్చించారట. ఇటీవల వైసీపీకి పలువురు నేతలు రాజీనామా చేయడం, కొంతమంది ఇతర పార్టీల్లోకి వెళ్లిపోవడం జరుగుతున్న సంగతి తెలిసిందే.