: తిరుమలలో రెండు రోజుల పాటు వీఐపీ దర్శనం రద్దు
తిరుమల కొండకు ఈరోజు భక్తులు పోటెత్తారు. దాంతో, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. సుమారు మూడు కిలోమీటర్ల మేర భక్తులు బారులు తీరారు. ఈ క్రమంలో స్వామివారి సర్వదర్శనానికి 36 గంటల సమయం, ప్రత్యేక దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీ కారణంగా నేడు, రేపు వీఐపీ దర్శనాన్ని రద్దు చేస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.