: అసెంబ్లీ మరమ్మతు ఖర్చులను 58:42 శాతం వంతున ఇరు రాష్ట్రాలు భరించాలి: కేసీఆర్


త్వరలోనే ఇరు రాష్ట్రాల అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీ భవనాలకు మరమ్మతులు చేయాలని నిర్ణయించారు. ఖర్చును ఇరు రాష్ట్రాలు 58:42 నిష్పత్తిలో భరించాలని టీఎస్ సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఇవాళ తెలంగాణ స్పీకర్ మధుసూదనాచారితో కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఖర్చుల విషయాన్ని స్పీకర్ ప్రస్తావించారు. రేపు గవర్నర్ సమక్షంలో జరగనున్న ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం సమయంలో ఈ విషయాన్ని సూచించాలని కేసీఆర్ చెప్పారు. ఇరు రాష్ట్రాల అసెంబ్లీ సమావేశాలు ఒకేసారి జరుగుతున్నందున ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూడాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు.

  • Loading...

More Telugu News