: తెలంగాణ ప్రభుత్వ తీరుపై కోదండరాం స్పందించాలి: రేవంత్ రెడ్డి
విద్యార్థులపై తెలంగాణ ప్రభుత్వం కక్షపూరిత వైఖరితో వ్యవహరిస్తోందని టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వ తీరుపై టీజేఏసీ ఛైర్మన్ కోదండరాం స్పందించాలని డిమాండ్ చేశారు. ఉద్యమ సమయంలో విద్యార్థులకు మొక్కిన నేతలంతా... ఇప్పుడు గద్దెనెక్కాక వారిని అణచివేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. 'విద్యారంగం-ప్రభుత్వ వైఖరి' అనే అంశంపై చర్చాగోష్ఠిని ఈ రోజు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రేవంత్ ప్రసంగిస్తూ పై విధంగా వ్యాఖ్యానించారు. బీహార్ లో పుట్టి విజయనగరం వలస వచ్చిన కేసీఆర్ ఏ స్థానికత ఆధారంగా తెలంగాణ సీఎం అయ్యారని ప్రశ్నించారు.