: తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్
రెండోరోజు ఆట ఆరంభంలోనే ఇంగ్లండ్ తొలి వికెట్ కోల్పోయింది. 37 పరుగులు చేసిన ఓపెనర్ రాబ్సన్ ను ఆరోన్ బౌల్డ్ చేశాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరు వికెట్ నష్టానికి 75 పరుగులు కాగా, కెప్టెన్ కుక్ 29, వన్ డౌన్ బ్యాట్స్ మన్ గ్యారీ బాలెన్స్ 4 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత్ తన తొలి ఇన్నింగ్స్ ను 148 పరుగుల వద్ద ముగించడం తెలిసిందే. 82 పరుగులు చేసిన కెప్టెన్ ధోనీ జట్టులో టాప్ స్కోరర్.