: 'చంద్రుడిపై ఏలియన్' వార్తలకు నాసా సైంటిస్ట్ వివరణ
ఓ ఆకారం చంద్రమండలంపై నడుస్తున్నట్టు ఇటీవలే నాసా ఫొటోలో కనిపించడం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ ఆకారం ఓ గ్రహాంతరవాసిదేనంటూ ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఊహాగానాలు బయల్దేరాయి. అయితే, నాసా శాస్త్రవేత్త ఒకరు అవన్నీ వట్టి పుకార్లేనంటున్నారు. ఏలియన్ అని అనుమానిస్తున్న ఆ ఆకారం ఫిల్మ్ పై దుమ్ము, గీతల కారణంగా ఫొటోలో చోటు చేసుకుని ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఆ ఫొటో డిజిటల్ హవా మొదలవకముందు నాటిదని తెలిపారు. 1971-1972 మధ్య కాలంలో మానవ సహిత వ్యోమనౌకలు అపోలో 15 , అపోలో 17 లలో ఏదో ఒక దాన్నుంచి ఆ ఫొటోను తీసుంటారని పేర్కొన్నారు. అప్పట్లో ఫొటోలకు ఫిల్మ్ నే ఉపయోగించేవారని, దాన్ని డెవలప్ చేసే క్రమంలో ఏలియన్ ఆకారంలో మచ్చ పడి ఉండొచ్చని సదరు సైంటిస్ట్ సూత్రీకరించారు.