: ఉద్యోగుల విభజనపై ప్రత్యూష్ సిన్హా కమిటీ భేటీ
ఏపీ, తెలంగాణ ఉద్యోగుల విభజనపై ఢిల్లీలో ప్రత్యూష్ సిన్హా కమిటీ భేటీ అయింది. రెండు రాష్ట్రాల సీఎస్ లు ఐవైఆర్ కృష్ణారావు, రాజీవ్ శర్మతో పాటు ఐఏఎస్ అధికారులు శ్రీధర్ రెడ్డి, పూనం మాలకొండయ్య, ఉమేష్ షరాఫ్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇరు రాష్ట్రాల ఉద్యోగుల కేటాయింపుపై చర్చలు ఈ సమావేశంలో ఓ కొలిక్కి వచ్చినట్లు సమాచారం. మిగతా వివరాలు తెలియాల్సి ఉంది.