: గర్భస్థ సమస్యలకు కారణమవుతున్న '9/11' దాడులు


పదమూడేళ్ల కిందట అమెరికాలోని న్యూయర్క్ నగరంలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ పై జరిగిన తీవ్రవాద దాడులు ప్రపంచం యావత్తు మరువలేనివి. ఆ దాడుల ప్రభావంతో వాతావరణంలో అలముకున్న దట్టమైన ధూళి ప్రస్తుతం ఆందోళనకు గురిచేస్తోంది. ముఖ్యంగా న్యూయార్క్ కు దగ్గరలో నివసిస్తున్న గర్భిణీ స్త్రీలు ప్రతికూల వాతావరణం కారణంగా సాధారణ స్థితి కంటే ఎక్కువ సమస్యలను ఎదుర్కొంటున్నట్లు ఓ సర్వే చెబుతోంది. అంటే, గర్భిణీలు నిర్దేశించిన కాలానికి ముందే శిశువులకు జన్మనివ్వడం లేదా పుట్టిన పిల్లలు తక్కువ బరువుతో ఉండడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయని ప్రిన్స్ టన్ యూనివర్శిటీకి చెందిన ఉడ్రో విల్సన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ అండ్ ఇంటర్నేషనల్ అఫైర్స్ జరిపిన పరిశోధన వెల్లడించింది. దానివల్ల అప్పుడే పుట్టిన శిశువులను ఐసీయూలో ఉంచాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని పరిశోధన పేర్కొంది. అంతకుముందు చేసిన పరిశోధనలో 9/11 దాడులకు సంబంధించిన ధూళి శిశువుల జననంపై స్థిరమైన ప్రభావాన్ని చూపుతున్నట్లు విల్సన్ స్కూల్ డైరెక్టర్ క్యూరీ చెప్పారు. ఆ ఘటన కారణంగా న్యూయార్క్ సిటీ దారుణమైన పర్యావరణ ఉపద్రవాలకు లోనైందని తెలిపారు.

  • Loading...

More Telugu News