: బీజేపీ నూతన కార్యవర్గాన్ని ప్రకటించిన అమిత్ షా
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పార్టీ నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. మొత్తం పదకొండు మందిని ఉపాధ్యక్షులుగా, ఎనిమిది మందిని ప్రధాన కార్యదర్శులుగా నియమించారు. ఉపాధ్యక్షుల్లో తెలంగాణ రాష్ట్రం నుంచి ఎంపీ బండారు దత్తాత్రేయ, కర్ణాటక నుంచి ఎంపీ బీఎస్ యడ్యూరప్ప ఉన్నారు. ఇక ప్రధాన కార్యదర్శులుగా రామ్ మాధవ్, జేపీ నద్దా, రాజీవ్ ప్రతాప్ రూడీ, తెలంగాణ నుంచి మురళీధర్ రావు మరికొంతమందికి షా జట్టులో చోటుదక్కింది. బీజేవైఎం అధ్యక్షుడుగా అనురాగ్ ఠాగూర్ ను కొనసాగించారు. మరో పదిమందిని జాతీయ అధికార ప్రతినిధులుగా నియమించారు. ఈసారి కొత్త కార్యవర్గంలో వరుణ్ గాంధీకి చోటు దక్కకపోవడం గమనార్హం.