: యుద్ధానికి సిద్ధమే...: మోడీ


భారత ప్రధాని మోడీ సింహనాదం చేశారు. యుద్ధానికి భారత్ అన్ని వేళలా సిద్ధమంటూ శత్రువులకు హెచ్చరికలు పంపారు. అయితే, కయ్యానికి మాత్రం కాలు దువ్వమని స్పష్టం చేశారు. భారత్ కు యుద్ధం చేసే శక్తి సామర్థ్యాలన్నీ ఉన్నాయని... ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి భారత బలగాలు సిద్ధంగా ఉన్నాయని ప్రధాని మోడీ తెలిపారు. ఇంత పెద్ద దేశాన్ని కాపాడుతున్నది త్రివిధ దళాలే అని చెప్పారు. సైనికులు అనుక్షణం భారత సరిహద్దులను కాపాడుతూనే ఉన్నారని కొనియాడారు. ఛత్రపతి శివాజీ కూడా సముద్ర రక్షణకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని... 'ఐఎన్ఎస్ కోల్ కతా' రాకతో నావికాదళం పటిష్ఠమయిందని చెప్పారు.

  • Loading...

More Telugu News