: తాత్కాలిక రాజధానే కాదు... శాశ్వత రాజధాని కూడా విజయవాడే
ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక రాజధాని విజయవాడ... శాశ్వత రాజధాని కూడా కానుందా? ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు మాటలను బట్టి విజయవాడనే ఏపీకి శాశ్వత రాజధానిగా ప్రభుత్వం నిర్ణయించిందని అనుకోవచ్చు. ఏపీకి శాశ్వత రాజధాని విజయవాడే అవుతుందని కోడెల ఈ రోజు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా విజయవాడ 99 శాతం ఖరారైందని కోడెల అన్నారు. దీనిలో భాగంగానే ప్రభుత్వ కార్యాలయాలను విజయవాడకు తరలిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. త్వరలో ఏపీ అసెంబ్లీని కూడా విజయవాడకు తరలించాలని తాను ప్రభుత్వాన్ని కోరానని తెలిపారు.