: పాలమూరు జిల్లాలో స్వైన్ ఫ్లూ కలకలం
తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లా దౌల్తాబాద్ మండలం బంగ్లాతండాకు చెందిన హనుమంతనాయక్ అనే వ్యక్తికి స్వైన్ ఫ్లూ లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. దాంతో, అతనిని చికిత్స కోసం హైదరాబాదు నాంపల్లిలోని కేర్ ఆసుపత్రికి తరలించారు. అటు బంగ్లాతండాలో వైద్య శిబిరం ఏర్పాటుచేసి అక్కడి వారికి పరీక్షలు నిర్వహిస్తున్నారు.