: పోలీసుల కాల్పుల్లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ మృతి
చైన్ స్నాచర్, నెల్లూరుకు చెందిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ శివ పోలీసుల ఎన్ కౌంటర్ లో మృతి చెందాడు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై నిన్న (శుక్రవారం) అర్ధరాత్రి తనిఖీలు నిర్వహిస్తుండగా పోలీసులపై అతను దాడి చేశాడు. ఆత్మరక్షణ కోసం వెంటనే పోలీసులు కూడా అతనిపై ఎదురుకాల్పులు జరిపారు. ఈ ఘటనలో క్రిమినల్ అక్కడికక్కడే మరణించాడు. కొంతమంది పోలీసులకు గాయాలయ్యాయి. శివపై దాదాపు 300 వరకు చైన్ స్నాచింగ్ కేసులు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు. రెండు నెలల నుంచి ఇతడిని తాము పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. కాగా, కాల్పులు జరిగిన ప్రదేశాన్ని ఈ ఉదయం సైబరాబాదు పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ పరిశీలించారు.