: ఐపీఎస్ ల కేటాయింపు పూర్తికాకుండా, డీజీపీగా జేవీ రాముడిని ఎలా నియమిస్తారంటూ పిటిషన్


ఆంధ్రప్రదేశ్ డీజీపీగా జేవీ రాముడు నియామక ఉత్తర్వులను సవాలు చేస్తూ కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్)లో పిటిషన్ దాఖలైంది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ, తెలంగాణలకు ఐపీఎస్‌ల కేటాయింపులు పూర్తికాకముందే... రెగ్యులర్ డీజీపీగా జేవీ రాముడును నియమించడంతోపాటు... ఆయన పదవీకాలాన్ని మరో రెండేళ్లు పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయడం చెల్లదని సీనియర్ ఐపీఎస్ అధికారులు టీపీ దాస్, సయ్యద్ అన్వర్ హుడాలు పిటిషన్ దాఖలు చేశారు. ఏ రాష్ట్రానికి ఏ అధికారి వస్తాడో తెలియకుండానే... రెగ్యులర్ డీజీపీని నియమించడం వల్ల సీనియర్లకు అన్యాయం జరుగుతుందని వారు ఆరోపించారు. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం, యూపీఎస్సీ కుమ్మక్కయ్యాయని పిటిషన్ లో పేర్కొన్నారు. ఏపీ డీజీపీగా జేవీ రాముడి నియామకం, పదవీ కాలం పెంపు జీవోలను రద్దు చేయాలని పిటిషన్ లో న్యాయస్థానాన్ని అభ్యర్థించారు.

  • Loading...

More Telugu News