: శ్రీవారి సేవలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి.కె.ఘోష్ ఈరోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో తన కుటుంబ సభ్యులతో కలసి ఆయన స్వామి వారి దర్శనం చేసుకున్నారు. ఆలయం వద్ద ఆయనకు టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం చేసి, స్వామి వారి తీర్థప్రసాదాలను ఆయనకు అందజేశారు.