: అమెరికా డాక్టరుకు ఎబోలా!
ప్రపంచాన్ని వణికిస్తున్న ఎబోలా వైరస్ బారిన ఓ అమెరికన్ డాక్టర్ పడ్డారు. పశ్చిమ ఆఫ్రికాలోని లైబీరియాలో ఎబోలా బారిన పడ్డ రోగులకు వైద్య చికిత్స అందించడానికి అమెరికన్ డాక్టర్ కెంట్ బ్రాంట్లీ వచ్చారు. బాధితులకు చికిత్స అందించే క్రమంలో ఆయన కూడా ఎబోలా బారిన పడ్డారు. దీంతో ఆయనను అట్లాంటాలోని ఎమరీ యూనివర్శిటీ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. తాను కోలుకుంటున్నానని... త్వరలోనే కుటుంబ సభ్యులతో కలుస్తానని డాక్టర్ బ్రాంట్లీ అంటున్నారు. లైబీరియా ప్రాంతంలో ఇప్పటికే వెయ్యి మందికి పైగా ఎబోలా మహమ్మారి వల్ల చనిపోయారు. నైజీరియా, సియెర్రాలియోన్, లైబీరియా, గినియా దేశాల్లో దాదాపు రెండు వేల మంది ఎబోలా వ్యాధితో బాధపడుతున్నారు.