: భారీ స్కోర్ దిశగా ఇంగ్లండ్... తొలి ఇన్నింగ్స్ ను నిలకడగా ప్రారంభించిన ఓపెనర్లు


భారత్ - ఇంగ్లండ్ ల మధ్య జరుగుతున్న ఐదో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ వికెట్ నష్టపోకుండా 62 పరుగులు చేసింది. కుక్ 24, రాబ్సన్ 33 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ కేవలం 148 పరుగులకే ఆలౌటయ్యింది. కెప్టెన్ ధోని 82 మినహా... మిగతా బ్యాట్స్ మెన్ ఎవరూ చెప్పుకోదగ్గ పరుగులు చేయలేదు. ఎనిమిది మంది ఆటగాళ్లు రెండంకెల స్కోరు కూడా చేయలేకపోయారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోర్డాన్, వోక్స్ చెరి మూడు వికెట్లు తీయగా... అండర్సన్, బ్రాడ్ తలా రెండు వికెట్లు చేజిక్కించుకున్నారు.

  • Loading...

More Telugu News